సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణం తాపడానికి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రెండు కేజీల బంగారాన్ని శుక్రవారం ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. తెలంగాణ కళావైభవం చాటేలా, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ఆయన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చి.. తాజాగా రెండు కేజీల బంగారాన్ని అందజేశారు. నారసింహుడి ఆలయాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కుటుంబసమేతంగా […]