సారథి న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా హనుమంతుని పేట, ముత్తారం గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ.10లక్షల వ్యయంతో రెండు కి.మీ. మేర ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, ఎంపీడీవో రాజు, సర్పంచ్ ఎద్దు కుమార్, సదయ్య పాల్గొన్నారు.