Breaking News

ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

సారథి, పెద్దశంకరంపేట: బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేట మండలంలోని ఉత్తులూర్ గ్రామానికి చెందిన సంగమ్మ కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల ఎల్ వోసీ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, వైస్ […]

Read More
రైస్ మిల్లు ప్రారంభం

రైస్ మిల్లు ప్రారంభం

సారథి: పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బొడగట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లును నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతో సదుపాయంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, రైస్ మిల్లు యాజమాన్యం కనకరాజు, కందుకూరి రవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read More
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పేదలు ఆర్థికంగా ఎదగాలి

సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను మండలంలోని జీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి రూ.60వేలు, టెంకటి గ్రామానికి చెందిన సావిత్రికి రూ.35వేల చెక్కును ఆయన అందజేశారు. ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండల […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు

సారథి, పెద్దశంకరంపేట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దశంకరంపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్​ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ రాజు, .ఎంపీటీసీలు వీణాసుభాష్ గౌడ్, స్వప్నరాజేష్, దామోదర్, సర్పంచ్​లు నాయకులు ప్రకాష్, నరేష్, అశోక్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.

Read More
అట్టహాసంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

అట్టహాసంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు పెద్దశంకరంపేట మండలంలో విశేష స్పందన లభిస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలతో పాటు నగదును పార్టీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అందజేశారు. మండలంలో దాదాపు ఐదువేలకు పైగా సభ్యత్వ నమోదు చేశామని, అందులో ఇప్పటివరకు 2500 సభ్యత్వాలను ఆన్​లైన్​లో నమోదు చేసినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. […]

Read More

బీరప్ప అందరివాడు

సారథి న్యూస్, నారాయణఖేడ్: కురుమల ఆరాధ్యదైవమైన బీరప్ప అడుగుజాడల్లో నడవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని ఆబ్బెంద గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప, మహా లింగ్ రాయ విగ్రహాలు ప్రతిష్ఠాపన, కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయనకు కురుమలు సంప్రదాయ పద్ధతిలో డోలు వాయిస్తూ, నృత్యాల మధ్య స్వాగతం పలికారు. కురుమలు మాట తప్పరని సీఎం కేసీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు.

Read More