న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న గవర్నింగ్ బాడీ తమ నిర్ణయాన్ని వచ్చేనెల 10కు వాయిదా వేసింది. అప్పటివరకు పరిస్థితులపై భాగస్వాములతో చర్చించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే మెగాఈవెంట్స్పై తుదినిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సుదీర్ఘమైన చర్చలు జరిగినా తమ షెడ్యూల్స్కు సంబంధించి ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. […]