వైట్ గాగ్రా.. గ్రీన్ దుప్పటా డ్రెస్‌లతో ఇద్దరు ముద్దుగుమ్మలు ‘కన్నానులే’ అన్న పాటను ఎంచక్కా పచ్చని చెట్లమధ్య ఆడి పాడి అలరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరైతే ఆమె స్నేహితురాలు ఉమాంగ్ గుప్త. వీరిద్దరూ కలిసి మణిరత్నం ‘బొంబాయి’ క్లాసిక్ మూవీలోని పాట చరణానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ రిక్రియేట్ చేశారు. ఈ పాటలో ఫర్మామెన్స్‌ను చూసి చాలామంది లావణ్యను పొగడ్తల్లో ముంచెత్తారు. […]