సారథి న్యూస్, ములుగు: కార్యాలయ ఫైళ్లను ఈ-ఆఫీస్ ద్వారానే సమర్పించాలని, మ్యానువల్ ఫైళ్లు పరిశీలించబోమని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా పాలనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులందరికీ వారి వారి లాగిన్ ఐడీలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయా శాఖల అధికారులంతా సెక్షన్ల వారీగా కరంట్ ఫైళ్లు, ముగింపు ఫైళ్ల వివరాలు సమర్పించాలన్నారు. కార్యాలయంలో నిర్వహించనున్న ఫైళ్ల వివరాలను స్కాన్ […]