సారథిన్యూస్, చొప్పదండి / ఖమ్మం: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళి […]