ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ కరోనా నుంచి కోలుకున్నారు. ‘ఆరోగ్యమంత్రి సత్యేంద్ర ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం నుంచే అయన విధుల్లో చేరతారు. మళ్లీ ఆయన దవాఖానలు సందర్శిస్తారు. కరోనాపై వైద్యశాఖ అధికారులతో సమావేశమవుతారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్చేశారు. కాగా ప్లాస్మాథెరపీ తీసుకోవడం వల్లే ఆయన కోలుకున్నారని వైద్యులు చెప్పారు.