ఢిల్లీ: కరోనాకు ఆయుర్వేద మందును తీసుకొచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయుర్వేద ఔషధం ‘కరోనిల్’కు సంబంధించి చేస్తున్న ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్‌కు సంబంధించి నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు తమకు తెలియవని పేర్కొన్నది. పతంజలి సంస్థ మంగళవారం ఆయుర్వేద మందు కరోనిల్‌ను అట్టహాసంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ […]