సారథి న్యూస్, వాజేడు: ఏటూరు నాగారం టైగర్‌జోన్ ను నిలిపివేయాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం నాగరాజు అన్నారు. ఆదివారం ఆదివాసీ నవనిర్మాణ సేన ముఖ్యకార్యకర్తల సమావేశం ములుగు జిల్లా అధ్యక్షుడు యెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో అనేక ఆదివాసీ గ్రామాలు ఉన్నాయని, టైగర్ జోన్ ను ఏర్పాటుచేస్తే ఆదివాసీలు నిర్వాసితులు […]
సారథి న్యూస్, వాజేడు, ములుగు: కొమరం భీమ్ 80వ వర్ధంతిని ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథులుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో ఆదివాసీల హక్కులు, ఆదివాసీ ప్రజలకు […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని సామాజిక దూరం పాటించి తరిమికొట్టాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని మన్ననూర్, అమ్రాబాద్, మాధవానిపల్లి గ్రామాల్లో ఆదివాసీ చెంచులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా జనజీవనానికి, దినసరి కూలీలకు ఇబ్బందులు అయినప్పటికీ లాక్ డౌన్ తప్పదన్నారు. లాక్ […]