సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి నుంచి డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న12 లేగ దూడలను అల్లదుర్గం సీఐ జార్జ్, పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ కలిసి బుధవారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రామోజీపల్లి అటవీ ప్రాంతంలో 30లేగ దూడలను తరలించేందుకు పలువురు వ్యక్తులు కట్టివేసి ఉంచారని, అందులో 12 లేగ దూడలను తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయంపై కేసుదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలను తరలిస్తే కఠినచర్యలు […]