కండ్లు ఎర్రబడ్డాయా, అయితే జాగ్రత్త అది కరోనా కావచ్చు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు కండ్లు ఎర్రబడటం కరోనా లక్షణమేనని కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోన్ సోలర్టె తెలిపారు. కరోనా రోగుల్లో 15 శాతం మందికి కండ్లకలక, కండ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ సమస్యతో వచ్చే వారికీ కోవిడ్ పరీక్షలు చేయడం ఉత్తమమని సూచించారు.