సారథి న్యూస్, హయత్నగర్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సైగా పనిచేసి.. ట్రాన్స్ఫర్పై వెళ్తున్న సైదారెడ్డిని స్థానిక వార్డుసభ్యుడు మొగుళ్ల జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మొగుళ్ల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మూడేళ్లపాటు ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో విశేషసేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎం.నరేష్ గౌడ్, ఎండీ ఇమ్ము, వినీత్ గౌడ్, అఖిల్ రెడ్డి, సందీప్, అజయ్, సాధిక్, మహేష్ పాల్గొన్నారు.