ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని.. ఆయన ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ఈ నెల 10న ప్రణబ్‌ముఖర్జీ అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో […]