రాష్ట్ర మంత్రుల ఆశ్చర్యం, అభినందనలు సామాజికసారథి, హైదరాబాద్: అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. విజయ్ కుటుంబసభ్యులతో హైదరాబాద్ వచ్చి మంత్రులకు తాను నేసిన చీరను చూపించారు. చీర నేసేందుకు పట్టిన సమయం, ఎలా నేసారనే వివరాలు మంత్రులు విజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తాను ఇంతవరకూ చూడలేదని […]