సారథి న్యూస్, నర్సాపూర్: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో యువకులు పంచాయతీ సిబ్బందికి బియ్యం, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజునాయక్, కౌడిపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామాగౌడ్, సాయిలు, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి, బాలింతలు సొసైటీ డైరెక్టర్ సోమరమేష్ గుప్తా, మాజీ సర్పంచ్ సారయ్యగౌడ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శంకర్ ఉన్నారు.
సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బోడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దఅంబర్ పేటకు చెందిన వీరమళ్ల వంశీకృష్ణ, అతని స్నేహితులు దివేష్, శ్రీకాంత్, సతీష్ హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్లకు చెందిన ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరమళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ..19 రోజులుగా నిరుపేదలను […]
సారథి న్యూస్, నర్సాపూర్: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ బీహార్ కార్మికులు, గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పంచాయతీ కార్మికులకు కూరగాయలు, బియ్యం, శానిటైజరులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సోమని మాణిక్య గౌడ్, శేఖర్ గౌడ్, భూమగౌడ్ పాల్గొన్నారు.
సారథి న్యూస్ ,దుబ్బాక: దుబ్బాక పట్టణంలో గురువారం చేనేత కార్మికుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలేష్ గౌడ్, రాజిరెడ్డి, రోశయ్య, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్ గౌడ్, భాను పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని సామాజిక దూరం పాటించి తరిమికొట్టాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని మన్ననూర్, అమ్రాబాద్, మాధవానిపల్లి గ్రామాల్లో ఆదివాసీ చెంచులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా జనజీవనానికి, దినసరి కూలీలకు ఇబ్బందులు అయినప్పటికీ లాక్ డౌన్ తప్పదన్నారు. లాక్ […]
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగరాజు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని మార్కెట్లో తిరిగి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు సూచనలు చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, స్థానిక సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.
సారథి న్యూస్, అచ్చంపేట: జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని 20వ వార్డు పేద ప్రజలకు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ బంధంరాజు, రాజేందర్, ఎడ్ల నర్సింహగౌడ్, కౌన్సిలర్ అంతటి శివ పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: బీజేపీ అధినాయకత్వం పిలుపు మేరకు మంగళవారం మహబూబ్ నగర్ మండలం ఓబులాయిపల్లిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు ఆధ్వర్యంలో కూరగాయలు పంచిపెట్టారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అంజమ్మ మాస్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రాజుగౌడ్, జాం శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, అంజయ్య, దర్పల్లి హరి, శివారెడ్డి పాల్గొన్నారు.