సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కరోనా కారణంగా 9 రోజులుగా సంబరాలు అంతంత మాత్రంగానే జరుపుకున్నా, చివరిరోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకల్లో పాల్గొన్నారు. ఏ పల్లెలో చూసినా సంబరాల ఉత్సాహమే కనిపించింది. డీజే పాటలు, డోలు వాయిద్యాలతో సందడిగా కనిపించింది. మహిళలంతా బతుకమ్మను పోయిరా.. గౌరమ్మా పోయిరా.. అంటూ సాగనంపారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లాలోని వాజేడు మండలం చికుపల్లి అటవీ పాంత్రంలో ఉన్న బొగత జలపాతాన్ని వెంకటాపురం రేంజ్ ఆఫీసర్, వాజేడు ఎస్సై తిరుపతి రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బొగత జలపాతానికి వచ్చే పర్యాటకులు అటవీ అధికారులు చెప్పిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరి కట్టుకుని బొగత జలపాతం సందర్శనకు రావాలని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. […]
సారథి న్యూస్, ములుగు: కలెక్టరేట్ లో ప్రజల నుంచి సోమవారం విజ్ఞప్తులు స్వీకరించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య తెలిపారు. భూసమస్యలకు సంబంధించి 25, సదరం పెన్షన్లకు సంబంధించి మూడు, ఇతర శాఖలకు సంబంధించి మూడు .. మొత్తం 31 విజ్ఞప్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటించి, వచ్చిన దరఖాస్తులను శానిటైజేషన్ కు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాస్క్లు తప్పకుండా కట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని కలెక్టర్ సూచించారు.