సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను బుధవారం కరీంనగర్ క్యాంపు ఆఫీసులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్, ఉపాధ్యక్షుడు బి.యాదయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రాజబాబు, సమ్మయ్య, అంజయ్య, నూనె రమేష్, ప్రవీణ్ కుమార్, సంగయ్య, రాజయ్య, సంతోష్, డేవిడ్ సన్, సాయిలు, మదన్, స్వామి పాల్గొన్నారు.
సారథి న్యూస్, గోదావరిఖని: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదినం పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంథని ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో నూతన వ్యవసాయ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ […]