సామాజికసారథి, వెల్దండ: ఓ పేదింటి గిరిజన బిడ్డ మంగళవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ మంగళవారం వెలువడిన ఫలితాల్లో టాప్ లేపింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నగారాగడ్డ తండాకు చెందిన రాత్లావత్ శారద, సల్యానాయక్ వ్యవసాయ కూలీలు. వారి కూతురు రాత్లావత్ నందిని బాలానగర్‌లో గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. 433/440 మార్కులు సాధించి అందరి శభాష్ అనిపించుకున్నది. కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్ సాధించింది. నందిని వెల్దండ ఎంపీపీ విజయ జైపాల్‌నాయక్ మరిది […]
మేడారం జాతరపై కలెక్టర్ సమీక్ష సామజిక సారథి, ములుగు: మేడారం మహా జాతర విజయవంతం చేయడానికి ఆదివాసి పెద్దలు, అదివాసి సంఘాలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసి పెద్దలు, ఆదివాసి సంఘాలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఎస్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లడారు. మేడారం జాతరలో ఆదివాసి సంఘాలకు 22 లిక్కర్ షాపులు […]
సామాజిక సారథి, మేడారం: మేడారం సామక్కసారక్క జాతర ఫిభ్రవరి 16నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తేదీలు ప్రకటించారు. వచ్చేనెల16 నుంచి 19 వరకూ కొనసాగే జాతరలో మొదటిరోజు 16వతేదీన సారలమ్మ కన్నతల్లి నుంచి గద్దెపైకి రాకా, 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం, 18న అమ్మవార్ల దర్శనం, 19న తిరిగి అమ్మవార్లు వనంలో ప్రవేశించనున్నారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశపరీక్ష (టీటీడబ్ల్యూఆర్‌జేసీ) ఫలితాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. రిజల్ట్‌ను TGGURKULAM లో చూసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపిస్తామని చెప్పారు. ప్రవేశ ప్రక్రియ తేదీలు త్వరలోనే ప్రటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 73 గిరిజన గురుకుల జూనియర్ కాలేజీల్లో 7,040 సీట్లు ఉండగా.. వీటిలో ప్రవేశాలకు మార్చి 8న నిర్వహించిన పరీక్షకు 10,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.