సారథి న్యూస్, దుబ్బాక: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఈనెల 19న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేల్లాపూర్ వార్డులో రైతు మట్ట బుచ్చిరెడ్డి(36) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. బాధిత కుటుంబానికి గురువారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.ఆరులక్షల చెక్కును అందజేశారు.
సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నుంచి ప్రజలను కాపాడాలని శివ్వంపేట మండలం చాకిరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.