Breaking News

‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్​లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి కోసం నిరంతర అధ్యాయనానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ భవనంలో ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, మ్యూజియం వంటి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఈ భవనానికి దేశంలోనే గొప్ప గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.