Breaking News

వరంగల్

పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి

పంచాయతీ పన్నుల కలెక్షన్స్ పెంచాలి

సారథి న్యూస్, ములుగు: గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేయాలని ములుగు జిల్లా అడిషనల్​ కలెక్టర్​ ఆదిత్య సురభి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మాణం, పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పల్లె ప్రకృతి వనాలను కాపాడాలని సూచించారు. ప్రతిఒక్కరూ మొక్కలను రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని కోరారు. జనరల్ ఫండ్స్ గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పర్యాటక కేంద్రాలలైన రామప్ప, లక్నవరంలో టూరిస్టులు వచ్చి చెత్తపడేస్తున్నారని, వాటిని క్లీన్​ చేయించేందుకు చార్జీలు వసూలు […]

Read More
జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే

జాగ్రత్తగా ఎన్నికల డ్యూటీ చేయాలే

సారథి న్యూస్, ములుగు: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రెండవ విడత ట్రైనింగ్​ ఇచ్చారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, సహాయ ఎన్నికల అధికారి కె.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్, పెద్ద బ్యాలెట్ బాక్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ డ్యూటీని జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీఏవో శ్రీనివాస్, […]

Read More
మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి

మహిళల హక్కులకు రక్షణ కల్పించాలి

సారథి న్యూస్, ములుగు: మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏకలవ్య ఎరుకల గిరిజన హక్కుల పరిరక్షణ సాధన సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై రాష్ట్ర నలుమూలల ఎక్కడో ఒకచోట ప్రతిరోజు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్​ చేశారు.

Read More
ఎస్టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

ఎస్టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్​ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. […]

Read More
స్త్రీమూర్తిని స్మరించుకుందాం

స్త్రీమూర్తిని స్మరించుకుందాం

సారథి న్యూస్, వెంకటాపూర్: కనుపాపల తలచి, ఆత్మీయతను పంచి, కుటుంబం కోసం అహర్నిశలు కష్టించే స్త్రీమూర్తిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సర్వర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, పోలీసు స్టేషన్ లో మహిళా పోలీస్​కానిస్టేబుళ్లు, జవహర్ నగర్ పెట్రోల్ బంకులో […]

Read More
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం

సారథి న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటుందని ఎస్టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వత్​రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ములుగు ఎస్టీయూ భవన్లో అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ, మోడల్ స్కూలు టీచర్ల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ముందుండి పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎస్టీయూ మద్దతు ప్రకటించించిన […]

Read More
నిరాశ్రయులను ఆదరిద్దాం

నిరాశ్రయులను ఆదరిద్దాం

సారథి న్యూస్, ములుగు: మతిస్థిమితం కోల్పోయిన నిరాశ్రయులను ఆదరించాలని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. నాలుగు రోజుల క్రితం మల్లంపల్లిలో ఓ అనాథ వృద్ధుడికి తస్లీమా స్వయంగా అన్నం తినిపించిన విషయం విదితమే. శనివారం ఆమె ఆఫీసుకు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ వృద్ధుడు చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, జుట్టుతో చలనం లేకుండా పడుకుని ఉండడం చూసి ఆమె చలించిపోయారు. క్షవరం చేయించి తానే స్వయంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు కొనిచ్చి […]

Read More
క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు

సారథి న్యూస్, వాజేడు: మండలంలోని కొంగల గ్రామంలో జగన్నాథపురం సబ్ సెంటర్ లో ఏసీఎఫ్ క్యాంపు నిర్వహించారు డాక్టర్ యమున. ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దగ్గు, జ్వరం, బరువు తగ్గిపోవడం, తేమడతో రక్తంపడడం, ఆకలి మందగించడం వంటి వారిని గుర్తించి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. కార్యక్రంమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర రావు, సర్పంచ్ శివరామకృష్ణ, ఎచ్ఎస్ కోటిరెడ్డి, ఎస్టీఎస్ వెంకటేశ్వరరావు, ఎస్.రవి, ఎల్ టి.రజినీకాంత్ పాల్గొన్నారు.

Read More