Breaking News

కర్నూలు

నేడు ‘వైఎస్సార్​సంపూర్ణ పోషణ’ ప్రారంభం

నేడు ‘వైఎస్సార్​ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

సారథి న్యూస్, కర్నూలు: వైఎస్సార్ ​సంపూర్ణ పోషణ పథకాన్ని ఈనెల 7న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి క్యాంపు ఆఫీసు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ​ద్వారా ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ భాగ్యరేఖ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం ద్వారా కర్నూలు జిల్లావ్యాప్తంగా గర్భిణులు 38,258 మంది, బాలింతలు 42,259 మంది, లక్ష మందికిపైగా చిన్నారులు లబ్ధిపొందుతారని వివరించారు. అంగన్​వాడీ కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం కిట్​ను అందజేస్తారని పీడీ భాగ్యరేఖ […]

Read More
మహిళా అభ్యున్నతే మా ధ్యేయం

మహిళా అభ్యున్నతే మా ధ్యేయం

సారథి న్యూస్, కర్నూలు: మహిళా అభ్యున్నతే తమ పార్టీ లక్ష్యమని నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఎస్ హసీనాబేగం అన్నారు. శనివారం ఆ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా హక్కుల సాధనకు పోరాడుతూ వారిని చైతన్యపరిచే దిశగా తమ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టంచేశారు. మహిళలు అన్నిరంగాల్లో వెనకబడి ఉన్నారని అన్నారు. మహిళలు చైతన్యవంతమై ఓ శక్తిలా ఎదిగినప్పుడే సమాజం సమగ్ర సమైక్యతతో వెలిగిపోతుందన్నారు. నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపక […]

Read More
స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం

సారథి న్యూస్, కర్నూలు: నగరాన్ని ‘స్వచ్ఛ కర్నూలు’గా తీర్చిదిద్దేందుకు నగరంలోని ప్రతిఒక్కరూ సహకరించాలని నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ కోరారు. శనివారం స్థానిక ఉర్దూ ఘర్ లోని దుకాణదారులతో మాట్లాడుతూ.. నగరంలో పూర్తిస్థాయిలో ప్రతి దుకాణ యజమాని ఒక చెత్తబుట్టను ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య కార్మికులకు తప్పకుండా ఇవ్వాలన్నారు. ఆరుబయట చెత్తపారబోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ స్థాయిలో ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్​ర్యాంకుల్లో ఈసారి కర్నూలు నగరాన్ని మెరుగైన స్థానంలో ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. […]

Read More
ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్​

ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్​

సారథి న్యూస్, కర్నూలు: ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్ ఎంపిక కోసం దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ అయిన 12 మంది జిల్లా కలెక్టర్లలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈనెల 9న ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్ కాన్ఫరెన్స్​ ద్వారా కేంద్ర కేబినెట్ సెక్రటరీ బృందానికి కలెక్టర్​ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్, పాలన సంస్కరణల శాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) సతీష్ […]

Read More
డ్రిప్​ ద్వారా సమృద్ధిగా పంటల సాగు

డ్రిప్​ ద్వారా సమృద్ధిగా పంటల సాగు

సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చని, అందుకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఏపీ ఎంఐపీ ఏపీడీ బి.సుదర్శన్‌ రైతులకు సూచించారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎర్రకోటలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని ఏపీడీ పరిశీలించారు. పంటసాగులో మొక్క మొక్కకు కావాల్సిన నీరు అందించేందుకు పైపు ఏర్పాటుచేసిన విధానం, మొక్కలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తదితర అంశాలను రైతు ఏపీడీ బి.సుదర్శన్‌ వివరించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం […]

Read More
ఎస్వీ సేవ.. అభినందనీయం

ఎస్వీ సేవ.. అభినందనీయం

సారథి న్యూస్, కర్నూలు: సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు పుస్తకాలు ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్​శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డిని ప్రశంసించారు. శుక్రవారం విజయవాడలో ఎస్వీ మోహన్‌ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్ట్‌–1 ప్రశ్నపత్రాన్ని మంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ నిర్వహించడమే కాకుండా గ్రాండ్‌ […]

Read More
వీధివ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాల్సిందే

సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా చితికిపోయిన వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ నిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరితగతిన రుణాలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కమిషనర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంబంధిత అధికారులతో సమావేవం నిర్వహించారు. రుణాలు ఇవ్వడానికి జాప్యం చేస్తున్న బ్యాంకు అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్దేశిత బ్యాంక్ లాగిన్ లో […]

Read More
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యంను పరిమితి స్థాయిలో సరఫరా చేసుకోవచ్చని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మద్యం విక్రయించడం ద్వారా సులువుగా డబ్బు సంపాదించాన్న లక్ష్యంతో పెద్దమొత్తంలో తెంగాణ, కర్ణాటక నుంచి కొందరు మద్యం తెప్పిస్తున్నారు. గురువారం కర్నూలు మండలం జి.సింగవరం గ్రామం వద్ద సీఐ రాజశేఖర్‌ గౌడ్‌ నేతృత్వంలో పోలీసు వాహనాలను తనిఖీచేయగా పెద్దమొత్తంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. కల్లూరు మండలం దూపాడుకు చెందిన బోయ […]

Read More