- ఇదీ తెలంగాణలో కరోనా పరిస్థితి
- జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొంతమేర తగ్గినట్లే కనిపిస్తోంది. సోమవారం కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మరణాలు సంభవించాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 273, రంగారెడ్డి జిల్లాలో 73 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 67,660కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 48,609 మంది కోలుకోగా, 18,500 మంది చికిత్స తీసుకుంటున్నారు. వ్యాధి బారినపడి ఇప్పటి వరకు 551 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.