సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలోని డిస్ట్రిక్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్(డీపీఆర్వో) ఆఫీస్ లో ఖాళీగా ఉన్న ఏపీఆర్వో (అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) పోస్టులను అంగట్లో అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేందుకు అవసరమైన సిబ్బందిని డీపీఆర్వో ఆఫీస్ లో నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో దీన్ని ఆసరాగా తీసుకున్న నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల డీపీఆర్వో సీతారాం నాయక్ సరికొత్త దందాకు తెరలేపినట్లు […]