Comments Off on నాగర్ కర్నూల్ జిల్లాలో అధికార బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బిజినపల్లి జెడ్పిటిసి తూము హరిచరణ్ రెడ్డి
ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న సరైన గుర్తింపు లేకపోవడంతో పార్టీ మార్పు
మండలంలో జడ్పీటీసీగా ఆయనకు ప్రాధాన్యత లభించకపోవడంతోనే పార్టీ మారారని అభిప్రాయం. సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అక్కడక్కడ వరుస షాకు లు తగులుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది తాజాగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లి మండల జడ్పిటిసి తూము హరిచరణ్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కూచుకుల్లా రాజేష్ రెడ్డికి రోజురోజుకు ప్రజల నుంచి ఇటు నియోజకవర్గంలోని ప్రముఖ నాయకుల నుంచి మద్దతు పెరుగుతుంది తాజాగా బిజినపల్లి మండలం నుంచి జెడ్పిటిసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధికారం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బనే చెప్పవచ్చు . ఉద్యమ కాలం నుంచి తూము హరిచరణ్ రెడ్డి తండ్రి తూము నరోత్తం రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో పనిచేశారు . రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి తీసుకువచ్చి టిఆర్ఎస్ జండా ఎగరవేసిన ఘనత ఆయనకే దక్కుతుంది . ప్రస్తుతం ఆయన కుమారుడు తూము హరచరణ్ రెడ్డి బిజినపల్లి జడ్పిటిసిగా అధికార బి ఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు . కానీ ఆయన గెలిచినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే ఆయనను కనీసం అధికారిక కార్యక్రమాలకు పిలవక పోవడం తప్పించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం , ఇతర నాయకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో మనస్థాపనతో ఆయన ఎన్నికల ముందట ఈ నిర్ణయం తీసుకోవడం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా తూము హరిచరణ్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబం ఎన్నో ఆస్తులు అమ్మి టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశామని ఆయన తమకు తగిన గౌరవం లభించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేవలం ఎమ్మెల్యే అహంకారపూరిత ధోరణి వల్ల తాను పార్టీ మారాల్సి వస్తుందని ఆయన చెప్పారు . రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలుపారు .