సామాజిక సారథి, వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి జిల్లా గెస్ట్ లెక్చరర్లు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలనే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నామన్నారు. […]