సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, తన అనుచరులు, కార్యకర్తలకు జరిగిన ఇబ్బందులను మరిచిపోనని అన్నారు. ‘నన్ను ఎవరూ బుజ్జగించలేదు.. ఎవరు బుజ్జగించినా లొంగిపోయేది లేదు’అని ఆయన స్పష్టంచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ హోదాలో తాను గద్వాల సీఎం కేసీఆర్ సభకు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. […]