సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలంలోని నల్లవెల్లిలో కల్లు పంచాయితీ చినికి చినికి గాలివానగా మారింది. కాంట్రాక్టర్ ముందస్తుగా రూ.2లక్షలు ఒప్పుకున్న విధంగా రూ.లక్ష ముట్టజెప్పాడు. మరో రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది. తనకు మాముళ్లు ఇవ్వలేదని గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కల్లు అమ్మకాలను బంద్ చేయించాడు. దీంతో రోజువారీగా కల్లుకు అలవాటువాడిన వారు బిత్తరపోతున్నారు. ఇంతలో ఈ విషయం మరో ప్రజాప్రతినిధి దాకా వెళ్లింది. ఆయన తనకు సదరు లీడర్ తో ఉన్న రాజకీయ […]