సామాజిక సారథి, తుర్కయంజాల్: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన పాపాలను తాము ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తొర్రూర్ గ్రామానికి చెందిన సర్వేనంబర్ 383/1 లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భూములు కోల్పోయిన రైతులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి కలిసి చర్చలు జరిపారు. 2007వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఎకరాకు లక్షన్నర పరిహారమిచ్చి తమ భూములను లాక్కుందని, నిరుపేదలమైన మాకు న్యాయం చేయాలని వారు వాపోయారు. నాలుగు […]