సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్ రావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆకుల కరీముల్లా (33) మిస్సింగ్ మిస్టరీ గా మారింది. సిద్దిపేటకు చెందిన అతడు అల్లాదుర్గంలోనే ఒక రూమును కిరాయికి తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇంటికి వెళ్లొచ్చేవాడు. అక్టోబర్ 28న సిద్దిపేట వెళ్తున్నానని చెప్పివెళ్లాడు. తోటి టీచర్లు కూడా ఇదే చెప్పాడు. ఇప్పటికీ రూమ్‌కు రాలేదు.. ఇంటికి […]