Breaking News

టీచర్ మిస్సింగ్.. కలకలం

టీచర్ మిస్సింగ్.. కలకలం

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్ రావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఆకుల కరీముల్లా (33) మిస్సింగ్ మిస్టరీ గా మారింది. సిద్దిపేటకు చెందిన అతడు అల్లాదుర్గంలోనే ఒక రూమును ​కిరాయికి తీసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఇంటికి వెళ్లొచ్చేవాడు. అక్టోబర్​ 28న సిద్దిపేట వెళ్తున్నానని చెప్పివెళ్లాడు. తోటి టీచర్లు కూడా ఇదే చెప్పాడు. ఇప్పటికీ రూమ్​కు రాలేదు.. ఇంటికి పోలేదు. డ్యూటీలోనూ చేరలేదు. రెండు మూడు రోజులకు ఒకసారి తమతో మాట్లాడే కరీముల్లా నుంచి ఫోన్ రాకపోవడం, అమ్మానాన్నలు ఫోన్​చేస్తే కలవకపోవడంతో తెలిసిన చోటల్లా అతని ఆచూకీ కోసం వెతికారు. చేసేదిలేక చివరికి అల్లాదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకుల కరీముల్లా కనిపించడం లేదని అతని సోదరుడు ఆకుల చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని అల్లాదుర్గం ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

ఐపీఎల్​ బెట్టింగే కొంప ముంచిందా?
కరీముల్లా మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు అల్లాదుర్గం పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ లు నిర్వహించి ఆర్థికంగా దెబ్బతిన్నాడని, క్రెడిట్ ​కార్డుల భారం పెరిగిపోయిందని, అందుకే ఇంట్లోనే ఫోన్, క్రెడిట్ కార్డులను అన్నీ వదిలేసి వెళ్లడానికి నిర్ణయానికి వచ్చారని స్పష్టమవుతోంది. ఇంకా విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులే టీచర్ ​కరీముల్లా మిస్సింగ్​కు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.