సామాజిక సారథి, పెద్దశంకరంపేట: రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్ షెట్కార్ అన్నారు. మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండలం గొట్టిముక్కల, పెద్దశంకరంపేట ఎస్సీకాలనీల్లో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా సభ ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికల కోసమే హుజరాబాద్ లో దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని విమర్శించారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా వర్తింప చేయాలని ఆయన అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఊరికొక ఉద్యోగం […]
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి హాజరుకాని వారిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సామాజిక సారథి, తిమ్మాజిపేట: మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై తీర్మానం రాసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. శనివారం ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన తిమ్మాజిపేటలోని రైతువేదికలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి కావాల్సిన […]
సామాజిక సారథి, తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని చేగుంట గ్రామంలో శనివారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉట్టికొట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి. సర్పంచ్ బి.లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు పిల్లమల్ల మల్లయ్య, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.
సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఢిల్లీలోని ముఖ్యమంత్రి రెసిడెంట్ భవనంలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు వరప్రదాయిని అయిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఆందోల్, జహీరాబాద్ శాసనసభ్యులు సి.క్రాంతికిరణ్, మానిక్ రావు పాల్గొన్నారు.
కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కాన్సెప్ట్ బేస్డ్ అని తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది లేడీ సూపర్‌స్టార్ నయనతార. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి ‘కాత్తువాక్కుల రెండు కాదల్’లో నటిస్తున్న నయన్, తాజాగా ‘గోల్డ్’ అనే మలయాళ సినిమాకు సైన్ చేసింది. ‘ప్రేమమ్’ సినిమాతో మెప్పించిన ఆల్ఫాన్స్ పెత్రెన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్‌కు జంటగా నయన్ నటించనుంది. పృథ్విరాజ్ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. నయన్ గత చిత్రం […]
స్టార్ హీరోల సోషల్ మీడియా రికార్డుల్లో ఎక్కువ క్రేజ్ బన్నీకే ఉంది. సౌత్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్ ను క్రాస్ చేసింది. మరోవైపు ‘పుష్ప’ టీమ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ యేడు ప్రారంభంలో మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో కొంత భాగం షూట్ చేసిన తర్వాత మరికొంత షూట్ హైదరాబాద్‌లో చేశారు. అక్కడి షెడ్యూల్ కంప్లీట్ […]
సామాజిక సారథి, చొప్పదండి: నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్, నవతరం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల యూత్ క్లబ్ డెవలప్మెంట్కార్యక్రమాన్ని స్థానిక వైశ్య భవన్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ చిలక రవీందర్ మాట్లాడుతూ.. యువజన సంఘాలు అభివృద్ధి, చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాంటి వారికి తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం అధికారి బి.రవీందర్, నవతరం […]
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఔదార్యం తాడూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రెండెకరాల భూదానం తన సతీమణి స్మారకార్థం విద్యాభివృద్ధికి శ్రీకారం సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక సారథి, నాగర్‌కర్నూల్: పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత కారణంగా చాలా పేదపిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా కుటుంబ, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోడంతో ఎంతోమంది ఆడబిడ్డలు చిన్నతనంలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. చదువులకు పేదరికం అడ్డకాకూడదని, పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి గొప్పగా రాణించాలని […]