Breaking News

Day: July 16, 2021

‘భగీరథా’.. ఏమిటీ వృథా!

‘భగీరథా’.. ఏమిటీ వృథా!

సారథి, రామడుగు: సురక్షితమైన నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు అక్కడక్కడ అభాసుపాలవుతున్నాయి. కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం వెదిర అనుబంధ గ్రామమైన రాజాజీనగర్ లో భగీరథ పైపులు పగిలి కొద్దిరోజులుగా విలువైన తాగునీరంతా ప్రధాన రహదారిపై వృథాగా పారుతోంది. ఈ విషయమై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు చెబితే కాంట్రాక్టర్ పై నెపం నెట్టుతూ పబ్బం గడుపుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నీరంతా ఇలా పారుతుండటంతో రాజాజీనగర్ […]

Read More
కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి

కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి

నేటి రాశిఫలాలుతేదీ: 16.7.2021శుక్రవారం 1.మేషంవృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అశ్రద్ధ వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి. సంతానం, విద్య విషయాల్లో దృష్టి సారించడం మంచిది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. 2.వృషభంఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపెద్దల […]

Read More
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి

సారథి, పెద్దశంకరంపేట: విద్యార్థులు విద్యతో పాటు అన్నిరంగాల్లోనూ రాణించాలని బాలికల ఉన్నత పాఠశాల ఇన్​చార్జ్​ హెచ్ఎం లత సూచించారు. శుక్రవారం బాలికల ఉన్నత పాఠశాలలో బుక్స్ ​పంపిణీ చేశారు. భవిష్యత్​లో రాణించాలంటే విద్యార్థి దశ కీలకమని ఆమె సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్నిరంగాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్​లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ రవీందర్, టీచర్లు రామకృష్ణగౌడ్, జనార్ధన్, సల్మా, సోనుభాయ్, బసమ్మ, ఎమ్మార్పీ […]

Read More
26 నుంచి కొత్త రేషన్ కార్డులు

26 నుంచి కొత్త రేషన్ కార్డులు

ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ సీఎం కేసీఆర్​ వెల్లడి సారథి, హైదరాబాద్: ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హులైన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. జులై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియను నిర్వహించాలని […]

Read More