Breaking News

కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి

కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి

నేటి రాశిఫలాలు
తేదీ: 16.7.2021
శుక్రవారం

1.మేషం
వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ అశ్రద్ధ వల్ల సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి. సంతానం, విద్య విషయాల్లో దృష్టి సారించడం మంచిది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి.

2.వృషభం
ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాల్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఉద్యోగులకు అధికారులతో చర్చలు కలసిరావు. భాగస్వామ్యంగా మీరు ఆశించిన విధంగా రాణించలేరు.

3.మిథునం
ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎదుటివారితో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం శ్రేయస్కరం. అన్నివైపులా ఆదాయం అందుతుంది. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. పనివారితో చికాకులు తప్పవు.

4.కర్కాటకం
ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అవసరాలకు తగిన నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఇంటిలో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.

5.సింహం
కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. ప్రయాణాల్లో మెళకువ వహించండి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగులు అదనపు పనిఒత్తిడి నుంచి బయటపడతారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.

6.కన్య
దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబసభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తిచేయండి. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించాల్సి వస్తుంది. కొత్త వాహనాన్ని కొంటారు.

7.తుల
ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయుడం మంచిది. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు చెలరేగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధకలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగులకు నూతన బాధ్యతల ద్వారా తగిన విశ్రాంతి ఉండదు. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తవుతాయి.

8.వృశ్చికం
ఆరోగ్యంలో ఆకస్మిక ఆందోళన తప్పదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. ఉద్యోగులకు స్థానచలనం సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాల ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయి. డాక్టర్లకు శస్త్రచికిత్సల్లో ఏకాగ్రత మెళకువ అవసరం ఉంటుంది.

9.ధనస్సు
తెలిసీ తెలియక చేసిన పనులు ఇబ్బందులు కలిగిస్తాయి. మీ సంతానం పై చదువుల కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి కొత్త రుణాలు చేస్తారు. ఒక వ్యవహారంలో బంధువులతో విబేధాలు కలుగుతాయి. చిన్నతరహా, చిరు పరిశ్రమల వారి శ్రమకు తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. ఒక స్థిరాస్తిని అలవర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దూరప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి.

10.మకరం
రావలసిన ధనం చేతికి అందడంతో మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. చేపట్టిన కార్యక్రమాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాల ద్వారా శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. వ్యాపార విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. రాజకీయ నాయకులకు వాహన ప్రమాదాలు ఎదురవుతాయి.

11.కుంభం
రుణాలు తీర్చేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ఉభయుల సానుకూల ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. భూసంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నమ్మిన వ్యక్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

12.మీనం
బంధుమిత్రుల మధ్య అనురాగ, ప్రేమ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. బంధుమిత్రులతో అశుభకార్యాలకు హాజరవుతారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉంది. ధన వ్యవహారాలు కలిసివస్తాయి. మీపై అధికారుల ధోరణిలో మార్పు కనిపిస్తుంది. బాకీలు వసూలవుతాయి.

:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్ నం.95020 59649