Breaking News

Day: July 13, 2021

విషజ్వరంతో బాలుడి మృతి

విషజ్వరంతో బాలుడి మృతి

సారథి, వాజేడు: వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వైద్యం అందక బాలుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, దివ్యభారతి(కాంతమ్మ) నాలుగో కుమారుడు రాకేష్(3) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని మండలంలోని ప్రగళ్లపల్లిలో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వాజేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Read More