Breaking News

Month: May 2021

ఆస్పత్రుల్లో వైద్యం కరువు

– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా […]

Read More
ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్

ఫ్రీ హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంప్

సారతథి, సిద్దిపేట ప్రతినిధి: ఉచిత హ్యాండ్ బాల్ కోచింగ్ క్యాంపును ప్రారంభించినట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దామేర మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగబోయే ఫ్రీ హ్యాండ్ బాల్ క్రీడలకు 10 నుంచి 16 ఏండ్ల వయస్సు గల యువతి, యువకులు తమ పేర్లను నమోదు చేసుకొవాలన్నారు. త్వరలో లద్నూర్ గ్రామంలో జరగబోయే జిల్లా స్థాయి […]

Read More
గెలుపోటములు మైదానంలో ప్రారంభం

జీవితంలో గెలవాలి

– క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత సారథి, సిద్దిపేట ప్రతినిధి: గెలుపు ఓటమిలు మైదానంలో ప్రారంభమవుతాయని రేణికుంట గ్రామ సర్పంచి, సర్పంచుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొయిని కొమురయ్య అన్నారు. బుధవారం గుండ్లపల్లి సర్పంచి బెతెల్లి సమత రాజేందర్ రెడ్డి తండ్రి బెతెల్లి రాంరెడ్డి 8వ వర్థంతి సందర్భంగా క్రికెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ క్రీడకారులు క్రీడలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆత్మస్థైర్యం, పట్టుదల పెరుగుతోందన్నారు. […]

Read More
ఐపీఎల్​పై కరోనా పడగ

ఐపీఎల్​పై కరోనా పడగ

టోర్నీ నిరవధిక వాయిదా సేఫ్​ ప్లేస్​ లోకి ప్లేయర్స్​ బీసీసీఐకి రూ.2వేల కోట్ల నష్టం న్యూఢిల్లీ: ఇండియన్ ​ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్)పై కరోనా పడగ పడింది. ఫలితంగా ఐపీఎల్ ​2021 నిరవధికంగా వాయిదా పడింది. పలువురు ప్లేయర్లకు కొవిడ్​–19 పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. […]

Read More
ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!

ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్​ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. చాలా మంది ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లింపుల పట్ల కొంత గడువు ఇచ్చే విషయాన్ని ఆర్​బీఐకి ఆయా బ్యాంకులు తెలియజేశాయి. లోన్లు తీసుకున్నవారికి మరో మూడునెలల […]

Read More
10 వరకు దస్తావేజు సేవలు బంద్

10 వరకు దస్తావేజు సేవలు బంద్

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీ వరకు దస్తావేజు సేవలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని యూనియన్ ​జిల్లా ప్రధాన కార్యదర్శి నాగులరాజు తెలిపారు. భూ విక్రయ కొనుగోలుదారులు, ప్రజలు సహకరించగలరని కోరారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

Read More
కరోనా ఉందని తప్పుడు రిపోర్టు

కరోనా ఉందని తప్పుడు రిపోర్టు

ఆస్పత్రిపై కేసు నమోదు సారథి, వేములవాడ: కరోనా టెస్టుల్లో తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ కొవిడ్ ఆస్పత్రిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ వెంకటేశ్​ తెలిపారు. పోలీసుల కథనం.. చిట్టి మంగమ్మ అనే మహిళ స్వల్ప జ్వరం లక్షణాలతో మాతృశ్రీ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సీటీస్కాన్, రక్తపరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని ఆమెకు సూచించారు. సుమారు రూ.1.5లక్షలు […]

Read More
ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా జర్నలిస్టులు

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నియంత్ర నిబంధనలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని స్పష్టంచేశారు. ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, […]

Read More