సారథి, తాడ్వాయి: వన్యప్రాణి విభాగం పరిధిలోని నర్సింగాపూర్ బీట్ తునికాకు కల్లాలను ములుగు జిల్లా అటవీశాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ధేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలన్నారు. ఆకుల కట్టలను గన్నీ బ్యాగుల్లో సక్రమంగా నింపాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ డీ వో గోపాల్ రావు, తాడ్వాయి ఎఫ్ ఆర్వో షౌకత్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ కుమార్ స్వామి, బీట్ […]
సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ జార్జ్ హెచ్చరించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో బయటికి వస్తున్న పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలని, 10 గంటల తర్వాత ఎవరైనా బయట […]
సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలోని కమలాపూర్ కింది తండాకు చెందిన శతాధిక వృద్ధుడు పాపియా నాయక్(110) బుధవారం మృతిచెందాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చనిపోయాడు. శతాధిక వృద్ధుడు మృతి చెందడం పట్ల సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు కమలాపూర్ సర్పంచ్ కుంట్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, గ్రామస్తులు, సంతాపం తెలిపారు.