సారథి, మానవపాడు: కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు. ఒకరికొకరు కలిసి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామనికి చెందిన ఎండీ ఖాజాహుస్సేన్ నెలన్నర రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పదో తరగతి పూర్వవిద్యార్థులు (1998-99) రూ.63,500 ఆర్థికసాయం చేశారు. బొంకూర్ గ్రామానికి వెళ్లి మృతుడు ఎండీ ఖాజాహుస్సేన్ సతీమణి సైనాజ్ బేగం కుటుంబసభ్యులకు అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు […]
సారథి, వాజేడు: వాజేడు మండల కేంద్రంలో 30 ఏండ్లుగా ఆర్ఎంపీగా వైద్య సేవలందించిన డాక్టర్ పాండురంగ రాజు అలియాస్ పాయబాట్ల రాజు(80)కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజు పలు గ్రామాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రామైన ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చే వారికి ప్రథమ చికిత్స ద్వారా మెరుగైన వైద్యమందిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. తక్కువ ఖర్చులతో అనేకమంది ప్రాణాలను నిలబెట్టిన ప్రాణదాత ఆదివారం కరోనా కాటుకు బలికావడంతో ప్రజలు […]
– హుస్నాబాద్ లో ఇంటింటి సర్వే…వార్డు సభ్యులకు కౌన్సిలర్ సూచనలు సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి డా. రవి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వేను పరిశీలించి మాట్లాడారు. వార్డుల్లో ఎవ్వరికైన కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు. వ్యాధి తీవ్రతరం కాకముందే […]
– సైకాలజిస్టు ఎజ్రా మల్లేశం సారథి, రామడుగు: మనోధైర్యమే శ్రీరామ రక్ష అని సైకాలజిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సైక్రాలజిస్టు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతున్న తరునంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఆత్మ విశ్వాసాన్ని నింపుకోవాలన్నారు. స్వీయ నియంత్రణతోనే భయంకర మహమ్మారిని తరిమికొట్టచ్చన్నారు. ఎవరైన వ్యాధుల పట్ల భయం, నిరాశ […]