టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి డిపాజిట్ దక్కించుకోని బీజేపీసారథి, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18వేల పైచిలుకు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో జానారెడ్డి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ సైతం దక్కలేదు. ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు భగత్ కుమార్ టీఆర్ఎస్ తరపున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం నూతన ఎస్సైగా తాండ్ర వివేక్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భౌతికదూరం, మాస్కులు, సానిటైజర్లు తప్పకుండా వాడాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లుకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలో ఎవరైన అసాంఘిక కార్యక్రమాలు, గ్రామాల్లో కొత్తవ్యక్తులు సంచరిస్తే తమకు లేదా […]
బెంగాల్ దంగల్ లో దీదీ విజయం ఎత్తులు వేసి.. చిత్తయిన బీజేపీ తమిళనాడులో డీఎంకే జయకేతనం కేరళలో రెండోసారి విజయన్ సర్కారు అసోం, పుదుచ్చేరిని దక్కించుకున్న ఎన్డీఏ న్యూఢిల్లీ: బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దుమ్ములేపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 209 సీట్లను కైవసం చేసుకుంది. దీదీ సారథ్యంలో తీన్ మార్ మోగించింది. ఏకంగా అధికారాన్ని చేపడతామని గొప్పలు చెప్పిన కాషాయదళం మమతా బెనర్జీ ఎత్తుల ముందు బోల్తాపడింది. మార్చి 27 […]
చెపాక్ నుంచి నాడు కరుణానిధి నేడు ఉదయనిధి స్టాలిన్ గెలుపు చెన్నై: డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు, నటుడు, పార్టీ యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ఘన విజయం సాధించారు. స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి, ఏఐఎడీఎంకే అభ్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలిచారు. 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 156 స్థానాల్లో డీఎంకే విజయం ఖాయం చేసుకుంది. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో […]