సారథి ప్రతినిధి, ములుగు: అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వారి స్వగ్రామం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. చందూలాల్ మరణం ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటన్నారు. మంత్రిగా, ఎంపీగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె వెంట కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా […]
సారథి, ములుగు: తెలంగాణలో మాస్క్ ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా తప్పదని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్నిబంధన ఉత్తర్వులను వివరించారు. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, తరచూ శానిటైజర్ ఉపయోగించాలని కలెక్టర్సూచించారు.
సారథి, ములుగు: జిల్లా పోలీస్ కార్యాలయంలో ములుగు ఏఎస్పీ పి.సాయిచైతన్య నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని, కావునా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను తగ్గించుకోవాలని, పారదర్శకంగా దర్యాప్తు చేసి నేరస్తులకు […]
సారథి, చిన్నశంకరంపేట: గోదావరి జలాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ, హల్ది, పసుపులేరు, ఘనపూర్ ఆనకట్ట నుంచి నిజాంసాగర్ కు నీరు అందించి ఎండిపోయిన నదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని దర్పల్లి చెక్ డ్యాంలోకి చేరిన నీళ్లకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ కంకణబద్ధులై అహర్నిశలు కష్టపడి, […]
కరోనా రోగుల అంత్యక్రియల కోసం బంధువుల ఎదురుచూపులు వారణాసి, భోపాల్, ఇండోర్, ఘజియాబాద్, రాంచీల్లో కిక్కిరిసిన శ్మశానాలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మృత్యువిలయాన్ని సృష్టిస్తోంది. తొలిసారి లక్ష కేసులను దాటి పదిరోజుల్లోనే రెండో లక్షను అధిగమించిన మహమ్మారి ఇప్పుడు మృత్యుపంజా విసురుతోంది. ఒకవైపు కరోనా పేషెంట్లతో అంబులెన్సులు హాస్పిటళ్ల ముందు లైన్ కడుతున్నాయి. మరోవైపు శ్మశానవాటికల ముందు శవాల లైన్‌లు దర్శనమిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, వారణాసి, లక్నోతో […]
18 ఏప్రిల్ 2021 వారం: ఆదివారంతిథి: షష్టి సా. 5.47నక్షత్రం: ఆరుద్ర రాత్రి 12.45రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకుయమగండం: పగలు 12.00 నుంచి 1.30 వరకువర్జ్యం: ఉదయం 8.20 నుంచి 10.04 వరకుదుర్ముహుర్తం: సాయంత్రం 4.25 నుంచి 5.13 వరకు మేషం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ధన వ్యవహారాల్లో ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు […]