సారథి న్యూస్, వాజేడు: మండల కేంద్రంలోని కొంగలలో శ్రీరాములు, బొల్లె ప్రసాద్, బెల్లాల అజయ్ రాంరెడ్డి స్మారకార్థం జగన్నాథపురం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో కొంగల జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం మండలాల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా కొంగల కింగ్స్ లెవెన్, జగన్నాథపురం రైజింగ్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కొంగల జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 127 […]
సారథి న్యూస్, వెంకటాపూర్: పేదలకు సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ పిలుపునిచ్చారు. పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో హృదయ్(ఎన్జీవో) స్వచ్ఛంద సంస్థ సీఈవో షేక్ యాకూబ్ పాషా గూంజ్ సంస్థ సహకారంతో బుధవారం 220 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సమాజంలో చాలా మంది ఆకలితో ఆలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అలాంటి పేదలు ఎక్కడున్నా వారికి చేయూతనందించి దాతృత్వం చాటుకోవాలని […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా రైతుల శ్రేయస్సుకు 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతులకు ఉచితంగా ట్రాన్స్ఫార్మర్లను అందిస్తున్నామని తెలిపారు. బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి టి.హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 7,778 మెగావాట్ల సామర్థ్యం […]