సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని దులాపురం అటవీప్రాంతంలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. సోమవారం ఉదయం కొంగాల గ్రామానికి చెందిన కొందరు ఇల్లు కప్పేందుకు గుట్ట గడ్డి కోసం దులాపురానికి సుమారు 3.కి.మీ. దూరంలో ఉన్న మాసెలొద్ది గుట్టకు వెళ్లారు. వారంతా గడ్డి కోస్తున్న సమయంలో ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో భయాందోళనకు గురయ్యారు. అరుపులు వింటూ అటుగా వెళ్లగా, ఎండిన పెద్దచెట్టుపై చిరుత పులిని చూసి ఉలిక్కిపడ్డారు. […]