సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: గుండెపోటుతో చిన్నశంకరంపేట సహకార సంఘం వైస్ చైర్మన్ గుడికాడి కిష్టగౌడ్(56) సోమవారం మడూర్ గ్రామంలోని తన నివాసంలో కన్నుమూశారు. గతంలో చైర్మన్ పదవిలో కొనసాగిన తిగుళ్ల బుజ్జి మరణించడంతో ఇన్చార్జ్ చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన మరణంతో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. కిష్టగౌడ్ మృతి పట్ల సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.
సారథి న్యూస్, షాద్‌నగర్: సీఎం కె.చంద్రశేఖర్‌రావు దత్తపుత్రిక ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహం సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లూర్దుమాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం సీఎం సతీమణి శోభ, గిరిజన, మహిళా సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు ప్రత్యూషను పెళ్లి కూతురు చేశారు.
డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడాయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మిగతా మూడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ కు వెళ్తుంది. ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందనే విషయాలపై చాలా డౌట్స్ ఉన్నాయి. జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓంరౌత్, ‘సాలార్’ కూడా జనవరిలోనే సెట్స్ కు వెళ్తుందని […]
పదమూడేళ్ల క్రితం ‘ఢీ’తో ఎంటర్ టైన్ చేసిన మంచు విష్ణు, శ్రీనువైట్ల.. మళ్లీ ఇన్నాళ్లకీ ‘ ఢీ అండ్ ఢీ’ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో విష్ణుకి జోడీగా ఇద్దరు హీరోయిన్లను సెలెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ‘ఢీ’ సినిమాలో జెనీలియా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈసారి కామెడీ, యాక్షన్ డబుల్ రేంజ్‌లో ఉంటాయని ముందే చెప్పిన విష్ణు.. గ్లామర్ ను కూడా డబుల్ డోస్ లో చూపించడానికి ప్రగ్యా జైస్వాల్, అను ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక […]
సారథి న్యూస్, మానవపాడు: తెగ చలి పెడుతోంది. మంచు దుప్పటి పరుచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని చాలా గ్రామాల్లో పొగమంచు ఇలా కమ్మేసింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి 8.15 గంటల వరకు సూర్యోదయం కనిపించడం లేదు. గ్రామీణ ప్రకృతి సౌందర్యాన్ని‘సారథి’ జర్నలిస్టు సాధిక్ తన కెమెరాలో ఇలా బంధించారు.