Breaking News

Month: July 2020

కమల్​, రజిని కాంబినేషన్​

కమల్​, రజిని కాంబినేషన్​

కోలీవుడ్​లో కళామతల్లి ముద్దు బిడ్డ కమల్​హాసన్​ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్​నేషనల్​ బ్యానర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్​తో సినిమా తీయనున్నారని.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారన్న వార్త చాలా రోజుల క్రితం హల్ చల్ చేసింది. అయితే రజినీ ‘దర్బార్’ చిత్రం తర్వాత ‘వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శివ దర్శకత్వంలో ‘అన్నాత్తా’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో రజినీ కాంత్ సరసన హీరోయన్స్ […]

Read More
సత్తి ఇక్కడికొచ్చాడట..

సత్తి ఇక్కడికొచ్చాడట

విల‌క్ష‌ణమైన నటన, వస్త్రధారణతో.. తెలంగాణ గ్రామీణ యాస‌కు త‌న‌దైన మార్కుని జోడించిన బిత్తిరి సత్తి తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. మొదట వీ 6 ఛానెల్​ లో తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రి అలియాస్ జ్యోతితో చేవెళ్ల ర‌వి అలియాస్ బిత్తిరి స‌త్తి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాను ప‌నిచేసిన ఛాన‌ల్ లో అభిప్రాయ భేదాలు రావ‌డం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి స‌త్తి అక్కడ రాజీనామా చేసిన […]

Read More

రోగనిరోధకశక్తి పెంచుకోండిలా

ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్​ రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే చాలా రోగాలు మనదరి చేరవు. ఇందుకోసం మనం కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. అవేంటో ఇప్పడు చూద్దాంజ ఆపిల్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్‌ తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటారు. బొప్పాయి, నిమ్మ జాతిపండ్లు కూడా రోజు తీసుకోవాలి. […]

Read More
దయచేసి పక్క బ్రాంచ్‌కు వెళ్లండి

దయచేసి పక్క బ్రాంచ్‌కు వెళ్లండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ‘మా బ్యాంకులో ఉద్యోగి కోవిడ్‌ బారిన పడినందున బ్యాంక్‌ను మూసివేశాం. దయచేసి మరో బ్రాంచ్‌కు వెళ్లండి’. ‘మా కార్యాలయంలో ఇద్దరికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దయచేసి సహకరించండి’ ఇవీ హైదరాబాద్‌ నగరంలో కనిపిస్తున్న బోర్డులు. నగరంలో ఇటీవల కాలంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా భారీగానే ఉండడంతో నగరంలోని అనేక బ్యాంకులు, కార్యాలయాలు శానిటైజేషన్‌ పేరుతో రోజుల కొద్ది మూసివేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో వందల్లో […]

Read More
మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి ?

మైదాకు ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి?

సారథి న్యూస్​, నర్సాపూర్: సంస్కృతంలో గోరింట చెట్టును మేంధికా అంటారు. ఆ పదం నుంచే మెహిందీ అనే పదం వచ్చింది. ప్రాచీన కాలం నుంచి సౌందర్య, ఆరోగ్య సంరక్షణ సాధనాల్లో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులు, పూలు, వేర్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. గ్రీష్మరుతువు పూర్తయి వర్షరుతువు మొదలయ్యే సమయంలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అంతవరకూ వేడిని […]

Read More

నిర్మాతగా మారనున్న క్రిష్​

ప్రముఖ దర్శకుడు క్రిష్​ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఓ నిర్మాణసంస్థను ప్రారంభించనున్నారని టాక్​.ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే సినిమాలు నిర్మించనున్నట్టు టాక్​. లాక్‌డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు క్రిష్​ విన్నాడట. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి తన నిర్మాణసంస్థలో దర్శకుడిగా తొలిచాన్స్​ ఇస్తాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. ఇటీవల కృష్ణ అండ్ హిజ్ […]

Read More

కరోనాతో నటుడు మృతి

కరోనా మహమ్మారి సినీనటులను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. తాజాగాహాలీవుడ్‌ నటుడు నిక్‌ కార్డెరో (41) కరోనాతో మృతి చెందారు. కెనడా దేశానికి చెందిన నిక్‌ న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే సంస్థలో రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ‘రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌’, ‘బుల్లెట్‌ ఓవర్‌ బ్రాడ్‌వే’, ‘వెయిట్రస్‌’ తదితర నాటకాల్లో మంచి పాత్రలు చేశారు. ‘ఏ స్టాండప్‌ గై’, ‘గోయింగ్‌ ఇన్‌ స్టయిల్‌’, ‘ఇన్‌సైడ్‌ గేమ్‌’, ‘మాబ్‌టౌన్‌’ తదితర చిత్రాల్లో నటించారు. 2005 నుంచి 2020 వరకూ […]

Read More
వైఎస్సార్​కు ఘన నివాళి

వైఎస్సార్​కు ఘన నివాళి

సారథి న్యూస్, కడప: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం వైఎస్సార్‌ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ […]

Read More