Breaking News

రోగనిరోధకశక్తి పెంచుకోండిలా

ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్​ రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ ఉంటే చాలా రోగాలు మనదరి చేరవు. ఇందుకోసం మనం కొన్ని రకాల పండ్లను తీసుకోవాలి. అవేంటో ఇప్పడు చూద్దాంజ ఆపిల్ జీవక్రియ రేటును పెంచుతుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు. కావున యాపిల్‌ తింటే ఆరోగ్యంగా, చురుగ్గా కూడా ఉంటారు. బొప్పాయి, నిమ్మ జాతిపండ్లు కూడా రోజు తీసుకోవాలి. విటమిన్‌ ‘సి’ అధికంగా లభించే ఈ పండ్లతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి పెంచడంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వర్షాకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రోజూ దానిమ్మ పండు తింటే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అరటిపండులో విటమిన్లూ, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి. నేరేడు పండ్ల వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. ఇనుము, ఫోలేట్‌, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.