ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,211 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్ 9 నుంచి ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కాగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 1,22,793 మంది కరోనా బారిన పడ్డారు. 3,628 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 31 మంది మృతిచెందారు.