బెంగళూరు: పరీక్షలంటే పెన్ను, అట్ట, పెన్సిల్ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్, మాస్కు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో గురువారం టెన్త్ ఎగ్జామ్స్ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్ చేతిలో చూసినా శానిటైజర్, మాస్క్‌లే కనిపించాయి. సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్ చేయించుకుంటూ కనిపించారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎగ్జామ్స్నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ‘పదో తరగతి అనేది విద్యార్థుల […]
జైపూర్: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా కరోనా కోసం తయారు చేసిన మందుపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మెడిసిన్‌ను మహారాష్ట్రలో అమ్మనివ్వబోమని మంత్రి ప్రకటించారు. కాగా ఇప్పుడు రాజస్థాన్ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కోసం ఆ డ్రగ్‌ను రాష్ట్రానికి పంపలేదని, దాన్ని అమ్మేందుకు పర్మిషన్ కూడా ఇవ్వలేదని రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ రఘువర్మ చెప్పారు. ‘స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మనుషులపై డ్రగ్ ట్రయల్ చేసేందుకు పర్మిషన్ […]
బెంగళూరు: ప్రముఖ వ్యాపార సంస్థ యునీలివర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ చర్మ సౌందర్య సాధనం ఫెయిర్‌నెస్ క్రీమ్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారుస్తున్నట్లు ప్రకటించింది. అందులో నుంచి ‘ఫెయిర్’ అనే పదాన్ని తీసివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. పేరు మారుస్తున్నట్లు కంపెనీ స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించింది. కొత్త పేరుకు రెగ్యులేటరీ ఆమోదాలు రావాల్సి ఉందని అన్నారు. ‘అన్ని రకాల స్కిన్ టోన్స్ డైవర్సటీ ఆఫ్ బ్యూటీని సెటలబ్రేట్ చేసుకుంటాయనే స్కిన్ కేర్ పోర్ట్‌ఫోలియోకు మేం కట్టుబడి […]
ఒట్టావో, కెనడా: కరోనా వైరస్ కారణంగా కెనడాలో విధించిన లాక్‌డౌన్‌ను సడలించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో కలిసి బయటికి వచ్చారు. క్యూబెక్‌లోని గాటిన్‌క్యూలోని ఐస్‌క్రీమ్ పార్లర్‌లో కనిపించారు. మాస్క్ వేసుకుని, సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ తన ఆరేళ్ల కొడుకుకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. లాక్‌డౌన్ తర్వాత మొదటిసారి బయటికి వచ్చారు. తనకు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందని ప్రధాని కొడుకు అన్నాడు. చాలా రోజుల తర్వాత ఇష్టమైన ఐస్‌క్రీమ్ […]
సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ లో అల్లనేరేడు మొక్కలను నాటి ప్రారంభించారు. స్థానిక పార్కులో అనేక విశిష్టతలు ఉన్నాయి. సుమారు 630 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. రూ.8కోట్ల వ్యయంతో 15కి.మీ. ప్రహరీని సిత్రు వాల్, చైన్ లింక్ ఫినిషింగ్ తో నిర్మాణ చేపట్టారు.
సౌత్ జానర్లో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని సీనియర్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్లో కంటే కోలీవుడ్‌లోనే త్రిష హవా ఎక్కువగా ఉంది. తెలుగులో సీనియర్ హీరోల దగ్గరినుంచి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న హీరోలు అందరితోనూ నటించేసింది. అయితే కొద్దికాలంగా తెలుగు చిత్రాల్లో నటించడం తగ్గించిందనే చెప్పొచ్చు. 37 ఏళ్లు దాటుతున్నా త్రిష తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా తమిళంలో మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో చాన్స్ వచ్చినా డేట్స్ […]
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో వెండితెరకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు వాళ్లను ఫిదా చేసేసింది. సాయి పల్లవి అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నా ప్రతీ ప్రాజెక్ట్‌పై సైన్ చేయకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకోవడం ఆమె స్టైల్. అంతేకాదు ఒక ఫెయిర్‌నెస్ యాడ్ కోసం రూ.రెండుకోట్లు ఇస్తానన్నా.. అందులో నిజం లేదని, అలాంటి […]
కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాత్తు వాక్కుల్ ఇరెండు కాదల్’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు నయనతార కాగా, మరొక హీరోయిన్ సమంత చేస్తుందన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రాన్ని లోబడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితులే అందుకు కారణమట. అంతేకాదు నిర్మాతలకు భారం కాకుండా ఉండేందుకు సమంత కూడా తన రెమ్యునరేషన్ తగ్గించిందని సమాచారం. […]