Breaking News

Day: June 23, 2020

సామాజిక కార్యకర్త వెంకన్నకు డాక్టరేట్

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి): నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్, వీరన్న గుట్టకు చెందిన సామాజిక కార్యకర్త కందికంటి వెంకన్న కు గౌరవ డాక్టరేట్​ అందుకున్నారు. 20 ఏళ్లుగా ఆయన చేస్తున్న పలుసేవలు, సామాజిక కార్యక్రమాలను గుర్తించి జూన్ 20న బెంగళూరులో జరిగిన సదస్సు లో అంతర్జాతీయ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్స్ లర్ డాక్టర్ పవన్ కళ్యాణ్, చైర్మన్ డాక్టర్​ హరికృష్ణ, డాక్టర్​ ఆకుల రమేష్ పట్టాను ప్రదానం చేశారు. తనలో ప్రాణం ఉన్నంత వరకు అనాథలు, దివ్యాంగులకు సేవ […]

Read More

మీ సమస్యలు పరిష్కరిస్తా..

సారథి న్యూస్​, ఎల్బీనగర్(రంగారెడ్డి): నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఎంఆర్ఎఫ్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్​లో భాగంగా మన్సురాబాద్ డివిజన్​లో ఎమ్మెల్యే పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతీనగర్ నుంచి లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ పెద్దచెరువు మీదుగా అమ్మదయ కాలనీ, బాలాజీ నగర్, శుభోదయ నగర్, చిత్రసీమ కాలనీ, జడ్జస్ కాలనీ, జడ్జస్ కాలనీ ఫేస్–1 మీదుగా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వద్దకు […]

Read More

గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో చేరేందుకు ఇంటర్మీడియట్​ సెకండియర్​ స్టూడెంట్స్​కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్​లైన్​లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్​కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు. కౌన్సెలింగ్​ తేదీలు–బీఎస్సీ(ఎంపీసీ), జూన్​ 25, 26 తేదీలు..–బీఎస్సీ(ఎంఎస్​సీఎస్​)/బీఏ(హెచ్​ఈపీఏ), బీకామ్​(కంప్యూటర్​), జూన్​ 27, 28,29 తేదీలు.–బీఎస్సీ(బీజెడ్​సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్​), బీఎస్సీ(ఎన్​డీజడ్​సీ), […]

Read More

కర్ణాటక మంత్రి భార్యకు కరోనా

బెంగళూర్‌ : కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం సృష్టిస్తున్నది. సామాన్యులు, ప్రభుత్వాధికారులు, మంత్రులను వదలడం లేదు. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్​ భార్య, ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే సుధాకర్​ తండ్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్ట్‌ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయని మంత్రి ట్వీట్​ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో […]

Read More

10 బీర్లు తాగాడు ఆ తర్వాత..

బీజింగ్: అతి ఎప్పటికీ అనర్థదాయకమేనన్న లోకోక్తికి ఈ ఘటన అద్దం పడుతున్నది. చైనాలోని జేజియాంగ్ ప్రావిన్సుకు చెందిన హు అనే వ్యక్తి ఇటీవల ఒకే సారి 10 బీర్లు తాగాడు. అతర్వాత 18 గంటల పాటు మూసిన కన్నులు తెరవకుండా నిద్రించాడు. అంతే.. లేచేసరికి భయంకరమైన కడుపునొప్పితో తీవ్రంగా ఆయాసపడుతుండగా స్నేహితులు గమనించి దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షలు చేయగా.. 18 గంటల పాటు మూత్రవిసర్జన చేయకుండా అలాగే నిద్రపోవడంతో మూత్రాశయం గోడలకు చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. […]

Read More

కరోనా కాలంలో కాసుల వేట

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా కాలంలో అధికాదాయాన్ని పొందేందుకు ప్రైవేట్​ ఆస్పత్రుల యజమానులు పూనుకున్నారు. రోగుల నుంచి లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దానిగురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారింది. గతంలోనూ ఈ ఆసుపత్రులు భారీగానే డబ్బులు వసూలు చేసేవి. కానీ, ఇప్పుడు కరోనా కాలం వారికి బాగా కలిసివచ్చింది. నిన్న మొన్నటి వరకు కరోనా చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేవి. టెస్టులు కూడా అక్కడే చేసేవారు. కానీ, ఇప్పుడు పరీక్షల […]

Read More