సారథి న్యూస్, ఎల్బీనగర్: భారత్– చైనా సరిహద్దులో అమరుడైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబు చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ యాదగిరి యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, చారి, జనార్దన్, ఉగాది బల్లు, పిడుగు ప్రవీణ్, ప్రేమ్, ఉజ్వల్ శివాజి, శంకర్, […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: మూసినది ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఉదయం నాగోల్ బ్రిడ్జి ప్రక్కన పరీవాహక ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. మూసినది చుట్టూ నీళ్లు నిరంతరం ప్రవహించే విధంగా ఛానెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టుపక్కల పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, చెరువు నందు మొలిచిన గుఱ్ఱపు డెక్కను కూడా వెంటనే తొలగించాలన్నారు. మూసినది […]
సారథి న్యూస్, ఎల్బీనగర్ : భారత్-చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నట్లు తెలిపారు. కల్నల్ మృతి పట్ల ఉప్పల శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తంచేసి వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
సారథి న్యూస్, రామడుగు: చైనా శత్రుమూకల దాడిలో అసువులు బాసిన వీర జవానులకు కరీంనగర్ జిల్లా రామడుగు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అమర జవానుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
సారథి న్యూస్, ఖమ్మం: భారత్-చైనా సరిహద్దులో గల గాల్వన్ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో వీరమరణం చెందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి కల్నల్ సంతోష్ బాబుకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గురువారం సత్తుపల్లిలో కొవ్వొత్తిని వెలిగించి నివాళులు అర్పించారు. వీర మరణం చెందిన సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
సారథి న్యూస్, ములుగు: రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి, తినడానికి తిండి లేదు. నిలువ నీడ లేదు, విధి వెక్కిరించి వీధినపడ్డ ఓ నిరుపేద కుటుంబానికి చేయుతనందించి సహృదయాన్ని చాటుకున్నారు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రెడ్డబోయిన రాజు, మానస దంపతులకు వైష్ణవి, తేజశ్విని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారికి ఉండడానికి ఇల్లు లేకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కిరాయి ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో రాజు కాలు […]
‘సర్కార్‌వారి పాట’ చిత్రంలో మహేశ్‌బాబుతో కీర్తి సురేశ్ జతకట్టనున్నది. ఇన్‌స్టా లైవ్‌లో కీర్తీ సురేశ్ తన అభిమానులతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మహానటి సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
బుల్లితెర యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి అమ్మాయి. ప్రస్తుతం నిహారిక సినిమాలు చేస్తూనే డిజిటల్ వరల్డ్‌లోనూ రాణిస్తోంది. నాగసౌర్యతో చేసిన ఫస్ట్ సినిమా ‘ఒక మనసు’తో పర్వాలేదు అనిపించుకుంది. ఇక తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన ‘ఒరునల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ డిజిటల్ రంగంలో […]